భారత్‌లో HMPV కేసులు.. కేంద్రం కీలక ప్రకటన..! 1 d ago
HMPV కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక సూచనలు చేశారు. ఇదేమీ కొత్త వైరస్ కాదని.. 2001లోనే గుర్తించినట్లు వెల్లడించారు. వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని నడ్డా తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.